Thursday, November 23, 2017

ఫంక్షన్ లో కలిసిన స్కూల్‌ స్నేహితుల బృందం...

కె. రాము కుటుంబముతో ... 
ఒక ఫంక్షన్ లో హైదరాబాద్ లో కలిసిన 
రేమద్దుల స్కూల్‌ 1991-92 బ్యాచ్‌ స్నేహితుల బృందం...




Thursday, June 22, 2017

పాఠశాలకు రూ॥ 25,000 విలువగల బెంచీలను బహుకరణ...

వనపర్తి జిల్లా , పాన్ గల్ మండలంలోని ' రేమద్దుల స్కూలు' 
1991-92 బ్యాచ్‌ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం 14.05.2017 న ఘనంగా జరిగింది.
ఆ రోజు సమ్మేళనం లో అనుకున్నట్లుగా ఈ రోజు ( 22.06.2017 ) 
1991-92 బ్యాచ్‌ విధ్యార్థులు రూ॥ 25,000 విలువగల బెంచీలను, 
రేమద్దుల పాఠశాల GHM జె. లత గారు మరియు ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది.




Friday, June 16, 2017

రేమద్దుల గ్రామంలో ట్రాఫిక్‌ జామ్‌...

వనపర్తి జిల్లా, పాన్‌గల్‌ మండలంలోని రేమద్దుల గ్రామంలో
పెద్దమ్మ పండుగ 2017 మే 14-16 తేదీలలో చాల చాల ఘనంగా జరిగింది.
దాదాపు 24 సం|| ల తరువాత ఇప్పుడు మహా జాతర కంటే గొప్పగా జరుపుకున్నారు.
రేమద్దుల గ్రామంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది అంటే ఏవరు నమ్మరు.
కాని ఇది నిజము. దాదాపు 15,000 నుండి 20,000 మంది వరకు హాజరై వుంటారు.
ఊరులో ఎటు చూసిన రెండు, మూడు రోజులు గళగళలాడింది.
ప్రతి ఇంటికి ఒక టేంట్‌, 20-50 కుర్చిలు. ఒకటి లేదా రెండు మేకలు.
 ఏ ఇళ్ళు చూసిన కార్లులు, బైకులు, టాక్టర్లు... ఈలా ఊరంత సంతోషాలు, సంబరాలు మిన్నంటాయి.
 ఊరిలో ఏ ఇంటిని చూసిన వారి అందరి బంధువులు పండుగకు హాజరైనారు.
దానితో ప్రతి ఇళ్ళు కళకళలాడింది.
చాల మంది ప్రత్యక్షంగా ఏప్పుడు చూడనందువల్ల ఈ పండుగ గురించి పూర్తిగా తెలియలేదు.
ఇప్పుడు ఈ పండుగతో ఆ తరం వారికి, ఈ తరం వారికి అందరికి తెలిసినట్లు అయ్యింది.
ఆ తరువాత చాల గ్రామాలు చేయడం ప్రారంభించాయి. ఇప్పటికి చేస్తునే వున్నారు.


Thursday, May 18, 2017

అ 'పూర్వ ' "ఆత్మీయ సమ్మేళనం"...

పాన్ గల్ మండలంలోని ' రేమద్దుల స్కూలు' 
1991-92 బ్యాచ్‌ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం 
14.05.2017 న ఘనంగా జరిగింది.
ఆ మధుర జ్ఞాపకాలను మరొసారి మీకు గుర్తుచేసుకున్నారు
స్కూల్ ఆభివృద్దికి పూర్వపు విద్యార్దులు తోడ్పడాలి...

అప్పటి గురువులను ఘనంగా సన్మానం చేశారు. 
స్కూల్ కు రూ.20,000 విలువ కలిగిన బెంచిలు ఇచ్చారు.






Wednesday, May 17, 2017

25 సం.తరువాత స్కూలుకు వచ్చిన విద్యార్థులు...

వనపర్తి జిల్లా, పాన్ గల్ మండలంలోని ' రేమద్దుల స్కూలు'
1991-92 బ్యాచ్‌ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం 14.05.2017 న ఘనంగా జరిగింది.
ఆ మధుర జ్ఞాపకాలను మరొసారి మీకు గుర్తుచేసుకున్నారు.
స్కూల్ ఆభివృద్దికి పూర్వపు విద్యార్దులు తోడ్పడాలని పిలుపునిచ్చారు.
అప్పటి గురువులను ఘనంగా సన్మానం చేశారు.
స్కూల్ కు రూ.20,000 విలువ కలిగిన బెంచిలు ఇచ్చారు.











Thursday, May 11, 2017

మండలంలోనే రేమద్దుల పాఠశాల అత్యధికంగా ఉత్తీర్ణత :

మండలంలోనే రేమద్దుల పాఠశాల అత్యధికంగా ఉత్తీర్ణత :
 పాన్‌గల్‌ మండల పరిధిలో పదవ తరగతి ఫలితాలో 
 రేమద్దుల ఉన్నత పాఠశాల అత్యధికంగా 71 శాతం ఉత్తీర్ణత సాధించింది.
  జిపీఏ 9.0 సాధించిన అనుష పాఠశాలలో మొదటి స్థానం, 
  శిరిష రెండవ స్థానం సాధించారు. 
 రేమద్దుల ఉన్నత పాఠశాలల్లో ఉత్తమ గ్రేడ్‌ సాధించిన విద్యార్థులను
  జీహెచ్‌ఎం లత, ఉపాధ్యాయులు, 1991-92 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు,
  గ్రామస్థుల ఆధ్వర్యంలో సన్మానించారు.


Monday, May 1, 2017

25 సంవత్సరాల తరువాత సారును కలిశాము...

30.04.2017 ఈరోజు ఉదయం స్నేహితులం కలసి ( వీరయ్య, అస్మత్, రాము) వీరేందరు సారును (సైన్స్) హైదరాబాద్ లో ఇంటికి వేళ్ళి కలిశాము. ఆపరేషన్ అయింది. తక్కువగా ఉంటే తప్పనిసరి గా మీ సమ్మేళనం కు వస్తానన్నాడు. 
రేమద్దుల 1991-92 సం. 10వ తరగతి బ్యాచ్. వారి ఇంటికి వేల్లడంతో సారు చాల సంతోషంగా పిలైనారు. 25 సంవత్సరాల తరువాత మొదటి సారి కలిశాము. చూడగానే సారును వెంటనే గుర్తుపట్టలేక పోయాము.


Thursday, April 20, 2017

స్నేహితుల మొదటి మీట్ - 25 సం.ల తరువాత...

రేమద్దుల 1991-92 సం. 10వ తరగతి బ్యాచ్ 
స్నేహితుల మీట్ఁ 25 సం.ల తరువాత 16.04.2017 న 
లవ్ హైదరాబాద్, ట్యాంక్ బండ్ఁ వద్ద జరిగింది.
సమావేశానికి  రాము, వీరయ్య, శంకర్‌, రమణ, అస్మత్‌,
 మధు, అశోక్‌, నాగేష్‌ తదితరులు హాజరైనారు.
మేము చదువుకున్న పాఠశాల, ఆనాటి జీవితం గురించి
ఒక్కసారి గుర్తు చేసుకున్నాము. 25 సం||ల కిత్రం పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాము.
రేమద్దులలో మే 14, 2017న ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాము.
దాని జయప్రదం చేయడానికి ఒక నిర్వహణ కమిటి ఏర్పాడింది.


Monday, January 23, 2017

రేమద్దుల లో సంక్రాంతి ...

రేమద్దుల లో సంక్రాంతి ... సర్పంచ్, ఎంపిటిసి,  గ్రామ  పెద్దలు, యువకులు, తదితరులు....
Patigadda Hanuman Temple and Pochamma Thalli Temple...


Sunday, January 1, 2017

2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు....

మీకు, మీ కుటుంబ సభ్యులకు 
2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు....