Monday, July 26, 2021

రేమద్దుల స్కూలు పూర్వ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం...

 రేమద్దుల స్కూలు (పాన్ గల్ మండలం, వనపర్తి జిల్లా) 1994-95 బ్యాచ్‌ పూర్వ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం 25.07.2021 న ఘనంగా జరిగింది. మదుసుదన్ రెడ్డి,  రఘువర్ధన్, శ్రీనివాసులు, కరుణకర్ రెడ్డి, చిరాగ్ అలీ...54 మంది పాల్గొన్నారు. ఆ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను మరొసారి వారు గుర్తుచేసుకున్నారు. 



 ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినందుకు  మీకు ప్రత్యేక అభినందనలు. మన స్కూల్ ఆభివృద్దికి, మన పూర్వపు విద్యార్దులు అందరూ తోడ్పడాలి...

Saturday, January 9, 2021

రేమద్దుల అబ్బాయికి ప్రభుత్వ కోటలో MBBS సీటు...

 రేమద్దుల 1991-92 బ్యాచి కె వీరయ్య- రాజ్యలక్ష్మి గార్ల పెద్ద అబ్బాయికి

ప్రభుత్వ కోటలో MBBS సీటు వచ్చింది . చేవేళ్ల లోని

డా.పట్నం మహేదర్ రెడ్డి మెడికల్ కాలేజి, రంగారెడ్డి జిల్లా.
అబ్బాయికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, అభినందనలు ...💐💐

Friday, April 3, 2020

రేమద్దుల గ్రామం లో బియ్యం, పప్పు ఉచిత పంపిణీ ...

రేమద్దుల గ్రామం లో 30న నిరుపేదలైన 35 కుటుంబాలకి ఒకొక్క
కుటుంబానికి 25 kg ల బియ్యం 1kg పప్పు 10 గుడ్లు ఉచిత పంపిణీ కార్యక్రమం. 
ముఖ్య అతిధి గా పానగల్ Si శ్రీనివాసులు.



Wednesday, April 1, 2020

రేమద్దుల గ్రామ రోడ్లు నిర్బంధించడం...

రేమద్దుల గ్రామ ప్రజలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు, తెలియజేయడమేమనగా ఇతర గ్రామాలనుంచి వస్తున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని గ్రామంలో అన్ని రోడ్లు నిర్బంధించడం జరిగినది. కాబట్టి ఇట్టి విషయాన్ని మన గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు అందరి సహకారంతో కరోనా వైరస్ ను అరికట్టడానికి .గ్రామాన్ని కి దరిచేరనీయకుండా అత్యవసర పరిస్థితుల దృష్ట్య రహదారిని ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి ప్రజలంతా గమనించి సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ. సొంత నిర్బంధంలో ఉండాలగలరని మనవి.
ఇట్లు/మీ గ్రామ సర్పంచ్. మోటూరు మంజుల తిరుపతయ్య


Saturday, March 14, 2020

ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో '' గోల్డ్ మెడల్ ''...

రేమద్దుల 1991-92 బ్యాచి విద్యార్థిని శ్రీమతి సుభాషిని గారి అబ్బాయి 
సీ లోకేష్ కు బి ఈ (ఇంజనీరింగ్ ) సెకండ్ ఇయర్ లో '' గోల్డ్ మెడల్ '' (2019-20) సాధించారు. హైదరాబాదులోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు.
 ఫస్ట్ ఇయర్ లో గత సం. కూడా  '' గోల్డ్ మెడల్ '' సాధించారు. 
వారికి, వారి కుటుంబ  సభ్యులకు  హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు...


Sunday, January 19, 2020

రేమద్దుల గ్రామంలో సంక్రాంతి సభ..

వనపర్తి జిల్లా రేమద్దుల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 
35 సంవత్సరాలుగా క్రీడలు నిర్వహిస్తోంది. 
రేమద్దులలో సభలో మాట్లాడుతున్న DYFI రాష్ట్ర అధ్యక్షుడు ఎం.విప్లవ కుమార్ 
అర్ధరాత్రి వరకు కూడా కొనసాగిన సభ. 




Friday, January 17, 2020

రేమద్దుల లో సంక్రాంతి క్రీడలు ...

రేమద్దుల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 
35సంవత్సరాలుగా క్రీడలు నిర్వహిస్తోంది 2020 సంవత్సరం కూడా. 
ఎస్ ఎఫ్ఐ మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు వాలీబాల్ కబడ్డీ క్రికెట్ వివిధ కళారూపాలను నిర్వహిస్తోంది. 
ఈ క్రీడలు మాజీ MPTC వేణుగోపాల్ గారు. ఎస్ ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు 14.01.2020 న ప్రారంభించారు.